పార్లమెంట్ ప్ర్రత్యేక సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించేందుకు కేంద్రం 3 రోజులపాటు ఈ సెషన్ నిర్వహిస్తోంది. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లును సపోర్ట్ చేస్తున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఇప్పటికే హెచ్చరించాయి.