TG: తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తేజస్వి సూర్య తెలివిలేని వెధవ అని ఘాటుగా ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుపై అడ్డుగోలుగా మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు.