AP: తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏపీ ఎంప్లాయిస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘నేను తప్పు చేశాననడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రభుత్వం అధికారంలో ఉందని నన్ను డిస్మిస్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. గతంలో నేను ఉద్యోగులకు అనుకూలంగా పని చేశా. ఇలాంటి వాటికి భయపడేది లేదు.. చట్టపరంగా పోరాడుతా’ అని వెల్లడించారు.