TG: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల సంక్షేమ బిల్లును సర్కార్ ప్రవేశపెట్టనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది కార్మికులకు సామాజిక భద్రత, చట్టపరమైన హక్కులు లభించనున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ, గిగ్ వర్కర్ల జీవితాల్లో భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.