TG: మూసీ ప్రక్షాళన చేయకుంటే ఢిల్లీలా HYD మారే ప్రమాదం ఉందని CM రేవంత్ అన్నారు. ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఇది భగవత్ కార్యంగా భావిస్తున్నా. ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉంది. ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించే గొప్ప అవకాశం నాకు లభించింది. సముద్రపు ఒడ్డు లేని ఏకైక దక్షిణాది రాష్ట్రం మనది. మత సామరస్యానికి మూసీ ప్రాంతం వేదికకానుంది’ అని పేర్కొన్నారు.