AP: ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో నిలిచిపోయిన స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ నిధులను తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.75 కోట్లను విడుదల చేసింది. 2030 మే నాటికి పదవీ విరమణ పొందే సుమారు 8450 మంది ఉద్యోగులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.