AP: శ్రీసత్యసాయి జిల్లాలో పేలుడు ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో 21 మందికి గాయలవగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.