రైల్వే నెట్వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9,072 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, MP, బీహార్, జార్ఖండ్లలో 307 కి.మీ. మేర కొత్త ట్రాకులు నిర్మించనున్నారు. 2030-31 నాటికి వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యం. దీనివల్ల కీలక మార్గాల్లో రైళ్ల రద్దీ తగ్గి, సరుకు రవాణా మరింత వేగంగా, సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.