AP: కూటమి ప్రభుత్వం దూరదృష్టి కలిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూటమి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. జల్జీవన్ మిషన్కి నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో పులివెందుల, డోన్, ఉద్దానం నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికి తాగు, సాగునీరు అందిస్తామని పవన్ వెల్లడించారు.