AKP: జార్ఖండ్ రాష్ట్రం రాంచిలో ఏప్రిల్ 1న జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలకు రాష్ట్రం తరపున అనకాపల్లి జిల్లా నుంచి కె. దుర్గా శ్రావణి ఎన్నికైనట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కె. నరేష్ మంగళవారం తెలిపారు. సబ్ జూనియర్ హాకీ పోటీల్లో దుర్గా శ్రావణి మంచి ప్రతిభ కనపర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమెకు శిక్షణ కూడా ఇచ్చామని పేర్కొన్నారు.