AP: మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నేను జనసేనలో చేరలేదు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరా. ఆరోపణలపై విచారణ చేయాలని సీఎంకు లేఖ రాశా. లడ్డూ విషయంలో వైవీ సుబ్బారెడ్డిని వెనకేసుకు రాలేదు. వైవీని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అలా చేస్తే మొదట సంతోషించేది నేనే’ అని పేర్కొన్నారు.