TG: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయని జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని, లీడర్, క్యాడర్ లేని పార్టీ BRS అని విమర్శించారు. కరప్షన్, అహంకారం, డ్రగ్స్ పార్టీతో తమకు పొత్తు ఏంటని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని మండిపడ్డారు.