TG: ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గిరిజన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం, ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని గిరిజన ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.