TG: అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు బయట తాము ఏదైనా మాట్లాడితే అసెంబ్లీకి రండి అంటారు.. కానీ అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరని మండిపడ్డారు. టైం పాస్ కోసం జీరో అవర్ నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇంకా KCR గురించే మాట్లాడుతున్నారన్నారు.