AP: మాజీ సీఎం జగన్ మత్స్యకారులతో భేటీ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ‘కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయి, మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంపెనీని వెంటనే తరలిస్తాం. మా ప్రభుత్వం ఉంటే మత్స్యకారులకు 1250 మెకనైజ్డ్ బోట్లు అందేవి. చంద్రబాబు మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు’ అని విమర్శించారు.