TG: రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహించి రిటైర్ అయిన విజయ్ కుమార్ అనే ఉద్యోగికి రావాల్సిన రూ. 90 లక్షల బెనిఫిట్స్ ఇంకా అందలేదు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. ఆయనకు రావాల్సిన ప్రయోజనాలను 4 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. లేకపోతే 18శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని హెచ్చరించింది.