TG: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కి.మీల మెట్రో విస్తరణలో భాగంగా డబుల్ డెకర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో పంపిన డీపీఆర్‌ను పక్కనపెట్టి, నాగ్‌పుర్ తరహాలో కింద రహదారి, పైన మెట్రో వచ్చేలా R&B శాఖ డిజైన్ చేసింది. దీనివల్ల మొదటి అంతస్తులో జాతీయ రహదారి మూడు లేన్లు, ఆ పైన మెట్రో మార్గం వస్తుంది.