TG: కేంద్రానికి ఎక్కువ పన్నులు కట్టేది దక్షిణాది రాష్ట్రాలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘డీలిమిటేషన్ జరిగితే మేం పన్నులు కట్టాలి.. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి. అందుకే మీరు పెంచాలనుకున్నసీట్లలో సగం సీట్లు ప్రోరేటా ప్రకారం.. మిగిలిన సగం సీట్లు రాష్ట్రాల GSDP ఆధారంగా చేయండి. అప్పుడు ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రాలకు న్యాయం జరగుతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.