TG: ఆర్టీసీ సమ్మెతో పెద్దపల్లి జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా గోదావరిఖని డిపో నుండి అద్దె బస్సులను నడుపుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య డ్రైవర్లను ఏర్పాటు చేసి వీటిని తిప్పుతున్నారు. అయితే, కండక్టర్లు లేకపోవడంతో పురుషులకు టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో బస్సుల్లో ప్రయాణికులందరూ ఉచితంగా ప్రయాణిస్తున్నారు.