TG: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ‘సమస్యల పరిష్కారానికి కమిటీ వేశాం. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించాం. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామనడం పొరపాటు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం మినహా 29పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది’ అని తెలిపారు.