TG: విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ విద్యాసంస్థల తీరుకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ‘రైట్ టూ ఎడ్యుకేషన్’ అమలు కోరుతూ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులంతా ఏకమై ఈ పోరాటంలో పాల్గొనాలని ఆయన కోరారు. విద్య హక్కుగా అందే వరకు ఈ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.