TG: దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగానే సీట్ల పెంపు జరుగుతుందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. GSDP ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిని ఎవరిని అడిగి పెంచారో సమాధానం చెప్పాలన్నారు. జనాభాతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరుగుతుందన్నారు.