AP: రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తెచ్చేలా CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూయజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించారు. 2027 MAR నాటికి పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. దీంతో రైతులకు తమ భూములపై పూర్తిస్థాయి భరోసా లభిస్తుంది. సుమారు 1.37 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా (22A) నుంచి తొలగించనున్నారు.