AP: బాణసంచా అక్రమ నిల్వలు, నివారణ చర్యలపై హోంమంత్రి అనిత అసెంబ్లీలో మాట్లాడారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసేవారిపై 3,200 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా రూ.26.55 కోట్ల విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నాం. కోర్టులో పెండింగ్ కేసులకు సంబంధించి వేలం నిర్వహణకు అవకాశం లేదు. 2700 కేసుల్లో బాణసంచా వెనక్కి ఇచ్చాం’ అని హోంమంత్రి వెల్లడించారు.