AP: అనకాపల్లిలో ఏర్పాటు చేసిన YCP విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అమర్నాథ్ పాల్గొన్నారు. సంక్షేమం చేశామని.. కానీ ప్రచారం చేయలేకే ఓడిపోయామని అమర్నాథ్ అసహనం వ్యక్తం చేశారు. మోసపూరిత ప్రచారంతో కూటమి గెలిచిందన్నారు. ఏప్రిల్ 24న చోడవరంలో కొత్త కార్యాలయం ప్రారంభమవుతుందని తెలిపారు. మూలపేట పోర్టును రేపు సందర్శిస్తామని వెల్లడించారు.