TG: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా నాదెండ్ల మృతికి సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.