TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షిత్ మెహ్రా ఛైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఇరిగేషన్ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. CWC, NDSA మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. త్వరలోనే క్షేత్రస్థాయి పనులు వేగవంతం కానున్నాయి.