TG: బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారికి సీఎం పలు సూచనలు చేశారు. శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో ఈవీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఎల్లుండి ఆలయ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.