భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముంద్ర వేయాలంటే నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు. ప్రపంచ మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడం అత్యవసరమని వెల్లడించారు.