TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ సహా 9 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశించింది. BRS నుంచి 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ వ్యవహారంపై స్పీకర్ సహా ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది.