AP: ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామని CM చంద్రబాబు అన్నారు. ‘ఏడాది చివరినాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. YCP హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది. హౌసింగ్‌లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తోంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరించాలి’ అని అధికారులకు సూచించారు.