TG: హన్మకొండలో దారుణం జరిగింది. వరుసకు పిన్ని అయిన మహిళపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ధరావత్ రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మహిళపై కోరిక పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన కోరిక తీర్చాలని తరచూ ఒత్తిడి చేశాడు. నిన్న రాత్రి అత్యాచారానికి యత్నించగా.. ఆమె గట్టిగా అరవడంతో నిందితుడు పరారయ్యాడు. యువకుడిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.