TG: రామగుండం MLA రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైనా అడ్డుపడితే అడ్డంగా నరుకుతామని తీవ్రంగా హెచ్చరించారు. మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు రోజూ అందుబాటులో ఉండకపోవచ్చని, కానీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగితే తాము రెండు గంటల్లోనే అక్కడికి చేరుకుంటామని స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.