TG: కేసీఆర్ పాలన పైన పటారం.. లోన లొటారం అన్నట్లు సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మేడిగడ్డ వద్ద సభలో పాల్గొన్న పొన్నం.. నేతలు, అధికారులను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదన్నారు.