TG: మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ప్రారంభించిన మంత్రి సీతక్క.. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, దేశం బాగుంటుందనే ఉద్దేశంతో CM రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.