AP: వైసీపీ ప్రభుత్వం తరిమేసిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయని మంత్రి DSBV స్వామి తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ఆయా కంపెనీలు తిరిగి వస్తున్నాయని అన్నారు. విశాఖకు ఐటీ కంపెనీ IBM రావడం శుభ పరిణామం అని చెప్పారు. IBM మూడేళ్లలో రూ.322 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనుందని మంత్రి వెల్లడించారు. IBM కంపెనీ రాకతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.