జెన్-Z లో ‘బెడ్ రాటింగ్’ ట్రెండ్ అవుతుంది. అంటే విశ్రాంతి పేరుతో గంటల తరబడి పడుకొని ఫోన్లో వీడియోలు చూడటం, స్క్రోల్ చేయడం. అయితే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకోవడం మంచిదే కానీ.. రోజూ ఇలా చేస్తే దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. క్రమంగా ఇది నిద్రలేమి, హార్మోన్ల అసమత్యులతకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.