TG: ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. ఇదే అదనుగా ఆటోలు, క్యాబుల్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఈ మేరకు HIT TVతో వారి గోడును వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.