TG: తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉంటే.. తేజస్వి సంగతేంటో చూసేవారన్నారు. మహోన్నత ఉద్యమం, విద్యార్థుల పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడిందన్నారు.