AP: మహిళా రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటినుంచో ఉందని ఎంపీ పురందేశ్వరి అన్నారు. గతంలో చాలాసార్లు బిల్లు పెట్టినా సాకారం కాలేదన్నారు. ‘రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగిందని గ్రహించాలి. ఈ బిల్లు పాస్ కావడం మహిళల దశాబ్దాల కల. 2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం కొర్రీలు పెడుతోంది. జనగణన పేరుతో అభ్యంతరాలు చెబుతోంది’ అని విమర్శించారు.