AP: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ‘నేరస్తులను వదిలేసి వైసీపీ క్యాడర్ వెంట పడుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు చెంపలేసుకోవాలి. మహిళలను వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?’ అంటూ ప్రశ్నించారు.