AP: శ్రీసత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో నిన్న జరిగిన పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా.. 27 మందికి గాయాలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.