MHBD: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జయశ్రీ తెలిపారు. వృత్తి విద్య, సైనిక కళాశాలలో ప్రవేశాల కోసం అర్హత గల విద్యార్థులు ఈనెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.