CTR: పులిచెర్ల(M) పాతపేట సమీపంలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. అక్కడ మామిడి చెట్ల కొమ్మలను విరిచేసిన ఏనుగు కొబ్బరి చెట్లను సైతం కూకటివేళ్లతో పెకలించింది. అనంతరం అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.