AP: మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకోవడం బాధాకరమని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇండీ కూటమి భారత్లో ఉన్న మహిళలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. మహిళా బిల్లు వీగిపోయేలా చేసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా నేతగా రూ.400 కోట్ల నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తమ సంఖ్య మరింత పెరిగితే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోవచ్చని చెప్పారు.