చియాన్ విక్రమ్ హీరోగా ప్రేమ్ కుమార్ సీ. దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ‘చియాన్ 64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో చియాన్ సరసన యంగ్ హీరోయిన్ రియా షిబు కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.