VKB: చిలుకూరులోని SBI-RSETI ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18-45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉన్నాయి అని సూచించారు.