MLG: సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనే ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అన్ని శాఖల అధికారులు గ్రామాలకే వచ్చి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు.