AP: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కూమారుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో తన తండ్రిపై జరుగుతున్న ప్రచారం, విమర్శలపై ఆయన స్పందించారు. 2024 ఎన్నికల్లో తాము రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని, ఆ డబ్బులు ఇస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. తన తండ్రిపై పార్టీలోని వారే కుట్రలు చేశారని సుమన్ ఆరోపించారు.