NDL: డోన్ క్లబ్ హౌస్లో మెప్మా ఆర్పీలు, సిబ్బందితో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పథకాల అమలులో వేగం పెంచాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు లింకేజులపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.